జిమ్‌లో చెమటోడిస్తున్న ర‌ష్మిక.. వైర‌లవుతున్న నేష‌న‌ల్ క్ర‌ష్‌ వ‌ర్కౌట్స్ వీడియో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జిమ్‌లో చెమటోడిస్తున్న ర‌ష్మిక.. వైర‌లవుతున్న నేష‌న‌ల్ క్ర‌ష్‌ వ‌ర్కౌట్స్ వీడియో!

Rashmika Mandanna latest Gym Workout Video viral
  • జిమ్ ట్రైన‌ర్ స‌మ‌క్షంలో ఫిట్‌నెస్‌ పెంచుకునే ప‌నిలో ర‌ష్మిక
  • వ‌ర్కౌట్స్ కు సంబంధించిన‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న బ్యూటీ  
  • త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్న అభిమానులు  
నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మందన్న జిమ్‌లో చెమటోడిస్తున్న వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో జిమ్ ట్రైన‌ర్ స‌మ‌క్షంలో త‌న ఫిట్‌నెస్‌ను పెంచుకునే ప‌నిలో ర‌ష్మిక క‌నిపించింది. త‌న‌ వ‌ర్కౌట్స్ కు సంబంధించిన‌ వీడియోను ర‌ష్మిక త‌న అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. దీనిపై అభిమానులు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.

ఇక‌ ర‌ష్మిక ప్రస్తుతం పుష్ప‌-2 మూవీ షూటింగ్‌తో బిజీగా ఉంది. తాజాగా షూటింగ్ సెట్‌లో ఉన్న ఆమె లుక్ లీక్ కావ‌డంతో వైర‌ల్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఈ లీకైన‌ ఫొటోలో శ్రీవ‌ల్లి పాత్ర‌లో న‌టిస్తోన్న ర‌ష్మిక ఎరుపు రంగు చీర‌లో బంగారు ఆభ‌ర‌ణాలు ధ‌రించి ఎంతో అందంగా క‌నిపించింది. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమా ఆగ‌స్టు 15వ తేదీన విడుద‌ల కానుంది. 

అటు పుష్ప మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ర‌ష్మిక‌.. ఇటీవ‌ల విడుద‌లైన యానిమ‌ల్ చిత్రంతో మ‌రో సూప‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. అలాగే ఈ మూవీకి సీక్వెల్‌గా రానున్న యానిమల్ పార్క్‌లోనూ ఛాన్స్ కొట్టేసింది. ఈ విష‌యాన్ని డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగానే వెల్ల‌డించారు. సీక్వెల్‌లో ర‌ష్మిక‌ను కంటిన్యూ చేస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఇక తెలుగులో ప్ర‌స్తుతం రెయిన్‌బో, గ‌ర్ల్‌ఫ్రెండ్ సినిమాల‌లో ర‌ష్మిక న‌టిస్తుంది.
Advertisement
Rashmika Mandanna
Gym
Viral Videos
Tollywood
Instagram

More Telugu News