K Kavitha: ఈడీ కార్యాలయంలో కవితను కలిసిన కేటీఆర్, తల్లి శోభమ్మ

Shobhamma and KTR meets Kavitha
షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై దేశ రాజధానిలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆమె తల్లి శోభమ్మ, సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కలిశారు. గురువారం సాయంత్రం ములాఖత్ సమయంలో వీరు కవితను కలిశారు. వీరిద్దరితో పాటు న్యాయవాది మోహిత్ రావు కూడా ఆమెను కలిశారు. కుటుంబ సభ్యులు, లాయర్ దాదాపు 50 నిమిషాల పాటు కవితతో మాట్లాడారు.

కాగా, కవితను ఈడీ అధికారులు ఐదు రోజులుగా విచారిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసిన ఈడీ శనివారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు ఆమెను వారం రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. కవితను ఈడీ కేంద్ర కార్యాలయంలోనే ఉంచి ఆదివారం నుంచి విచారిస్తున్నారు.
Go Back to Shorts
K Kavitha
BRS
Telangana
ed

More Telugu News