మనవడు ఏకాగ్రహ్ కు అదిరిపోయే కానుక ఇచ్చిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
- నారాయణమూర్తి తనయుడు రోహన్ మూర్తికి గతేడాది పుత్రోదయం
- మనవడి పేరు మీద 15 లక్షల పేర్లు బదిలీ చేసిన నారాయణమూర్తి
- ఆ షేర్ల విలువ రూ.240 కోట్లు ఉంటుందని అంచనా
ఇక అసలు విషయానికొస్తే... నారాయణమూర్తి తన మనవడు ఏకాగ్రహ్ కు అదిరిపోయే కానుక ఇచ్చారు. తమ సంస్థలోని 15 లక్షల షేర్లను ఆయన మనవడి పేర బదిలీ చేశారు. ఈ మేరకు బీఎస్ఈ ఫైలింగ్ లో పేర్కొన్నారు.
మనవడు ఏకాగ్రహ్ కు నారాయణమూర్తి బదిలీ చేసిన షేర్ల విలువ రూ.240 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇంతకీ ఏకాగ్రహ్ వయసు ఐదు నెలలే. గత నవంబరులో జన్మించాడు. నారాయణమూర్తికి ఇన్ఫోసిస్ లో 1.51 కోట్ల షేర్లు ఉన్నాయి. కంపెనీలో ఆయన వాటా 0.40 శాతం ఉంటుంది.