బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త, పీఆర్వో రాజేశ్, మరో ముగ్గురికి ఈడీ నోటీసులు
- సోమవారం తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న ఈడీ
- కవిత ఇంట్లో సోదాల సమయంలో వీరి ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్న ఈడీ
- నిన్న మొత్తం పది ఫోన్లు సీజ్ చేసిన ఈడీ అధికారులు
ఢిల్లీ మద్యం కేసులో కవితను ఈడీ నిన్న అరెస్ట్ చేసింది. ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. కోర్టు ఆమెకు వారం రోజుల ఈడీ కస్టడీ విధించింది. ఈ నెల 23వ తేదీ వరకు ఆమెను ఈడీ అధికారులు విచారించనున్నారు. అంతలోనే ఇప్పుడు కవిత భర్తకు, మరో నలుగురికి ఈడీ నోటీసులు ఇవ్వడం గమనార్హం.