దత్తపుత్రుడు పవన్, బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, 420 చంద్రబాబు.. ఏమీ చేయలేరు!: కొడాలి నాని
- మోదీని చంద్రబాబు నానా బూతులు తిట్టారని వ్యాఖ్య
- పార్టీని పెట్టింది అమ్ముకోవడానికా అని పవన్ పై విమర్శ
- జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ అయ్యే పరిస్థితి లేదన్న నాని
రాష్ట్రం నాశనమయిందని అందరూ కలిసినట్టు చెపుతున్నారని... ప్రజలకు సంక్షేమం అందిస్తున్నందుకు రాష్ట్రం నాశనం అయిందా? అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలు, పోర్టులు, జెట్టీలను నిర్మించినందుకు రాష్ట్ర నాశనం అయిందా? అని అడిగారు.
ఒకప్పుడు ఒకరినొకరు తిట్టుకున్నారని... ఇప్పుడు సిగ్గు లేకుండా అందరూ కలిసి వస్తున్నారని కొడాలి నాని విమర్శించారు. జగన్ ను ఓడించడమే అన్ని పార్టీల లక్ష్యమని చెప్పారు. పవన్ కల్యాణ్ 21 సీట్లకు వచ్చారని... పార్టీని పెట్టింది అమ్ముకోవడానికా? అని ప్రశ్నించారు. జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ అయ్యే పరిస్థితి లేదని చెప్పారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అట్టర్ ఫ్లాప్ అని అన్నారు.