మ‌రోసారి డీప్‌ఫేక్ బారిన ప‌డ్డ‌ ర‌ష్మిక మంద‌న్న‌.. ఈసారి మ‌రింత‌ అస‌భ్య‌క‌ర వీడియో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మ‌రోసారి డీప్‌ఫేక్ బారిన ప‌డ్డ‌ ర‌ష్మిక మంద‌న్న‌.. ఈసారి మ‌రింత‌ అస‌భ్య‌క‌ర వీడియో!

Another Deep Fake Video of Rashmika Mandanna Goes Viral on Social Media
  • ఈసారి ఇంకా క్లియ‌ర్ డీప్‌ఫేక్ వీడియోను సృష్టించిన దుండ‌గులు
  • వీడియోలో అస‌భ్య‌క‌రంగా డ్యాన్స్ చేస్తూ క‌నిపించిన యువ‌తి
  • ఇలాంటి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్న ర‌ష్మిక అభిమానులు

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న మ‌రోసారి డీప్‌ఫేక్ బారిన ప‌డింది. ఈసారి ఆమె వీడియోను దుండ‌గులు మ‌రింత అస‌భ్య‌క‌రంగా ఎడిట్ చేసి పెట్టారు. ఈ వీడియోలోనూ కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా ఆమె ముఖాన్ని మార్ఫింగ్ చేశారు. ఈసారి ఇంకా చాలా క్లియ‌ర్ డీప్‌ఫేక్ వీడియోను సృష్టించ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ఈ డీప్‌ఫేక్ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. 

ఇక వైర‌ల్ అవుతున్న ర‌ష్మిక డిప్‌ఫేక్ వీడియోలో ఓ యువ‌తి అస‌భ్య‌క‌రంగా డ్యాన్స్ చేస్తూ క‌నిపించింది. దీనికి ర‌ష్మిక ముఖంను ఎడిట్ చేశారు. వీడియోపై ప‌లువురు మండిపడుతున్నారు. ఈ వీడియోపై ర‌ష్మిక అభిమానులు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. పోలీసులు ఇలాంటి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అంటున్నారు. ఇలాంటి వాటిని ఆపాల‌ని కోరుతున్నారు. ర‌ష్మిక డీప్‌ఫేక్ వీడియోలు చేయొద్ద‌ని కొంద‌రు హెచ్చ‌రిస్తున్నారు. వ‌రుస చిత్రాల‌తో త‌న‌కంటు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ర‌ష్మికకి ఇలాంటివి ఎదురుకావ‌డం బాధాక‌ర‌మ‌నే చెప్పాలి. 

కాగా, అల్లు అర్జున్‌తో చేసిన‌ 'పుష్ప' మూవీతో ఆమెకు పాన్ ఇండియా ఇమేజ్ ద‌క్కింది. ఆ త‌ర్వాత ఇటీవ‌లే ర‌ష్మిక మందన్న‌ బాలీవుడ్ మూవీ 'యానిమ‌ల్‌'తో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల‌తో దూసుకెళ్తున్న ఆమెకు డీప్‌ఫేక్ వీడియోలు త‌ల‌నొప్పిగా మారుతున్నాయి. ప్ర‌స్తుతం ఆమె 'పుష్ప‌-2', 'ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌', 'రెయిన్ బో' వంటి చిత్రాల‌తో బిజీగా ఉంది. అలాగే యానిమ‌ల్ సీక్వెల్ 'యానిమాల్ పార్క్‌'లోనూ ఆమె న‌టించ‌నుంద‌ని ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగా వెల్ల‌డించారు.
Advertisement
Rashmika Mandanna
Deep Fake Video
Social Media

More Telugu News