ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
- ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
- జూన్ 1వ తేదీ నుంచి కొత్త ఫిట్‌మెంట్ అమలవుతుందని వెల్లడి
- కొత్త పీఆర్సీతో ఆర్టీసీపై ఏడాదికి రూ.418 కోట్లకు పైగా అదనపు భారం పడనుందని వెల్లడి
కొత్త పీఆర్సీతో ఆర్టీసీపై నెలకు రూ.35 కోట్లు... ఏడాదికి రూ.418 కోట్లకు పైగా అదనపు భారం పడుతుందన్నారు. ఈ నిర్ణయంతో తెలంగాణ ఆర్టీసీలోని 53 వేలకు పైగా ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. పొన్నం ఇంకా మాట్లాడుతూ... తమ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహాలక్మి పథకం అమలు చేశామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ పథకం విజయవంతంగా సాగుతోందన్నారు.