కాజీపేట రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం.. వీడియో ఇదిగో!
- బొగ్గు వ్యాగన్ లో నిప్పంటుకుని పెద్ద ఎత్తున పొగలు
- పక్కనే నిలిపి ఉంచిన ప్యాసింజర్ బోగీలకు అంటుకున్న మంటలు
- భయాందోళనలతో స్టేషన్ నుంచి బయటకు పరుగులు తీసిన జనం
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయని అధికారులు తెలిపారు. స్టేషన్ లోని ప్లాట్ ఫాంలకు దూరంగా ఉన్న పార్కింగ్ ట్రాక్ లపై ఈ అగ్ని ప్రమాదం జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు. గూడ్స్ రైలులోని బొగ్గుకు నిప్పంటుకోవడంతో మంటలు ఎగిసిపడ్డట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు.