బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించిన నేపథ్యంలో శ్రేయాస్ అయ్యర్ కీలక నిర్ణయం!
- వరల్డ్ కప్ దృష్ట్యా ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని అయ్యర్ నిర్ణయించుకున్నట్టుగా వెలువడుతున్న రిపోర్టులు
- రంజీ సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నాడని పేర్కొన్న ‘రెవ్‌స్టోర్ట్స్’ రిపోర్ట్
- ప్రస్తుతం ఒక్కో సెషన్లో 200 బంతులు ఆడుతున్నానని వెల్లడి
క్రమంగా పని భారాన్ని పెంచుకోవడం కోసం అయ్యర్ ‘కోల్‌కతా నైట్ రైడర్స్’ అకాడమీకి వెళ్లాడని సన్నిహిత వ్యక్తి పేర్కొన్నట్టుగా రిపోర్ట్ వెల్లడించింది. ‘‘ఒక సెషన్లో 60 బంతులు ఆడిన తర్వాత అయ్యర్ నొప్పికి గురయ్యాడు. కాస్త ఇబ్బంది పడిన తర్వాత మళ్లీ ప్రాక్టీస్ చేశాడు. ప్రస్తుతం సెషన్‌కు 200 బంతులు ఆడుతున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్, ముంబై జట్టు ప్రధాన కోచ్ ఓంకార్ సాల్వి ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నాడు. అయ్యర్ పురోగతిని తెలుసుకునేందుకు ఓంకార్ సాల్వి చాలాసార్లు ‘కోల్‌కతా నైట్ రైడర్స్ అకాడమీని సందర్శించారు’’ అని సదరు వ్యక్తి పేర్కొన్నట్టుగా రిపోర్ట్ వెల్లడించింది. కాగా ఐపీఎల్ కారణంగా దేశవాళీ క్రికెట్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అయ్యర్, ఇషాన్ కిషన్‌లను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తప్పించిన విషయం తెలిసిందే.