25 ఏళ్ల తర్వాత హైదరాబాద్ వచ్చిన బిల్ గేట్స్

29-02-2024 Thu 06:42 | Telangana
Advertisement
  • హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఐడీసీని ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సందర్శన
  • ఐడీసీ ఇంజనీర్లతో మాట్లాడిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు
  • కృత్రిమ మేధ భారత్‌కు అతిపెద్ద అవకాశం కాబోతోందని గేట్స్ చెప్పారన్న ఐడీసీ ఎండీ
Advertisement
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ దాదాపు 25 సంవత్సరాల తర్వాత మొదటిసారి హైదరాబాద్‌ను సందర్శించారు. నగరంలో మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్‌ని (ఐడీసీ) ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 

కృత్రిమ మేధ (ఏఐ) భారత్‌కు అతిపెద్ద అవకాశమన్న బిల్‌ గేట్స్‌ అభిప్రాయాన్ని నిజం చేస్తూ ఏఐ ఆధారిత క్లౌడ్‌, సెక్యూరిటీ, గేమింగ్‌ విభాగాల్లో సరికొత్త ఆవిష్కరణల కోసం ఐడీసీ కృషి చేస్తోందని ఎండీ రాజీవ్‌ కుమార్ పేర్కొన్నారు. ఐడీసీ ఇంజనీర్లతో బిల్‌ గేట్స్‌ మాట్లాడారని మైక్రోసాఫ్ట్‌ ఐడీసీ ఎండీ రాజీవ్‌ కుమార్‌ వివరించారు. మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌,  సీఈవో సత్య నాదెళ్ల కూడా ఇటీవల భారత్‌లో పర్యటించారని, ఏఐ సాంకేతికత ఇండియాలో కీలకమవబోతోందని అభిప్రాయపడ్డ అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్‌ ఐడీసీకి మరింత ప్రాధాన్యం పెరుగుతోందని రాజీవ్‌ కుమార్‌ చెప్పారు.

కాగా హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్‌ ఇండియా డెవలప్‌మెంట్‌ సెంటర్‌ (ఐడీసీ)ను ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తయ్యింది. 1998లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు బిల్ గేట్స్ హైదరాబాద్ వచ్చారు. మైక్రోసాఫ్ట్‌ ఐడీసీ ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. ఆ తర్వాత క్రమంగా ఐడీసీ వృద్ధి చెందింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాల్లో ఈ కేంద్రం క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. అజూర్‌, విండోస్‌, ఆఫీస్‌, బింగ్‌, కోపైలెట్‌, కృత్రిమ మేధ (ఏఐ) వంటి మైక్రోసాఫ్ట్‌ ప్రపంచ స్థాయి ఉత్పత్తుల అభివృద్ధిలో ముఖ్యభూమిక పోషిస్తోంది.
Advertisement
Bill GatesHyderabadMicrosoft IDCMicrosoft

More Telugu News

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55
..more