Balasouri: జనసేన - టీడీపీ సీట్ల సర్దుబాటులో కొన్ని చోట్ల అసంతృప్తులు నెలకొన్నాయి: బాలశౌరి

Balasouri confident of  TDP and Janasena win
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ నుంచి ఏపీ ప్రజలకు విముక్తి కలిగించాలనేదే తమ లక్ష్యమని ఎంపీ బాలశౌరి తెలిపారు. జనసేనాని పవన్ కల్యాణ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా అందరం కట్టుబడి ఉంటామని చెప్పారు. వైసీపీ పాలనలో న్యాయం, ధర్మం లేవని... అధర్మం నాలుగు పాదాల మీద నడుస్తోందని విమర్శించారు. జనసేన - టీడీపీ సీట్ల సర్దుబాటులో కొన్ని చోట్ల అసంతృప్తులు చోటు చేసుకున్నాయని, ఇవన్నీ సాధారణ అంశాలేనని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని చెప్పారు.     

వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని... టీడీపీ - జనసేన కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని బాలశౌరి ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును గత టీడీపీ ప్రభుత్వం 70 శాతం పూర్తి చేసిందని... వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏమీ చేయలేదని విమర్శించారు. మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ ప్రాజెక్టు దివిసీమ ప్రాంతానికి తీరని కల అని... దాన్ని నిజం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. మచిలీపట్నం నియోజకవర్గంలో జాతీయ రహదారుల అభివృద్దిపై దృష్టి సారించామని తెలిపారు.
Go Back to Shorts
Balasouri
Janasena
Telugudesam

More Telugu News