కవిత పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
- ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు ఈడీ నోటీసులు
- నోటీసులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కవిత
- ఇదే కేసులో కవితకు సీబీఐ నోటీసులు కూడా జారీ
మరోవైపు ఇదే స్కామ్ లో కవితకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటి వరకు సాక్షిగా ఉన్న కవితను... సీబీఐ నిందితురాలిగా మార్చింది. దీంతో, ఈ కేసులో కవితకు ఉచ్చు బిగుస్తోందనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అయితే, ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా విచారణకు హాజరు కాలేనని సీబీఐకి కవిత లేఖ రాశారు. గతంలో ఇచ్చిన సెక్షన్ 160 నోటీసుకు 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందని లేఖలో ఆమె పేర్కొన్నారు. ఇది తన ప్రజాస్వామిక, రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తోందని చెప్పారు.