రెండో ఇన్నింగ్స్ లో కుప్పకూలిన ఇంగ్లండ్... టీమిండియా టార్గెట్ 192
- నాలుగో టెస్టులో గెలుపు దిశగా టీమిండియా
- రెండో ఇన్నింగ్స్ లో 145 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
- లక్ష్యఛేదనలో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసిన టీమిండియా
- రాంచీ టెస్టులో ముగిసిన మూడో రోజు ఆట
అనంతరం, 192 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 24, యశస్వి జైస్వాల్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే ఇంకా 152 పరుగులు చేయాలి.
ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులు చేయగా... టీమిండియా 307 పరుగులకు ఆలౌట్ అయింది.