ఎర్ర సముద్రంలో మరో నౌకపై హౌతీ మిలిటెంట్ల దాడి.. తొలిసారి నౌకను విడిచిపెట్టిన సిబ్బంది
- బెలిజ్ దేశానికి చెందిన నౌకపై యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి
- ధ్వంసమైన కొంత భాగం.. మొట్టమొదటిసారి నౌకను వదిలిపెట్టిన సిబ్బంది
- నౌక పూర్తిగా సముద్రంలో మునిగిపోయిందన్న హౌతీ ప్రతినిధి
దాడి కారణంగా గుర్తు తెలియని బ్రిటీష్ నౌకపై పూర్తిగా మునిగిపోయిందని హౌతీ ప్రతినిధి ఒక పేర్కొన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. రూబీమార్ నౌక చిన్న కార్గో షిప్ అని, దీని యజమాని ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్‌లో ఉన్నట్టుగా తెలుస్తోందని రిపోర్టులు పేర్కొన్నాయి. కాగా గతేడాది నవంబర్ నుంచి హౌతీ మిలిటెంట్లు యెమెన్ తీరంలో క్షిపణులు, డ్రోన్లతో వాణిజ్య నౌకలపై దాడి చేస్తున్నారు. ఇరాన్ సహకారంతో సముద్రంలో వాణిజ్య రవాణాలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికా, యూకేలతో ముడిపడిన నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధానికి ప్రతిస్పందనగా ఈ దాడులకు తెగబడుతున్నారు.