గృహిణి సేవలు అమూల్యం.. ఆర్థిక కోణంలో వాటిని చూడొద్దు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

19-02-2024 Mon 09:26 | National
Advertisement
  • ఓ ప్రమాదంలో మరణించిన గృహిణి
  • రూ. 2.5 లక్షల పరిహారం ఇచ్చిన వాహన యజమాని
  • అవి సరిపోవంటూ హైకోర్టుకు బాధిత కుటుంబం
  • ఆమె గృహిణి కాబట్టి ఆ మొత్తం సరిపోతుందన్న హైకోర్టు
  • గృహిణి సేవలు అమూల్యమైనవన్న సుప్రీం ధర్మాసనం
Advertisement
ఇంటిపని, వంటపని చేస్తూ సమయానికి కుటుంబానికి ఏం కావాలో అది అందిస్తూ చక్కగా ఇంటిని నిర్వహించే భార్య సేవలు వెలకట్టలేనివని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆమె సేవలను డబ్బు కోణంలో చూడడం తగదని పేర్కొంది. ఓ యాక్సిడెంట్ కేసు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2006లో ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి బీమా సౌకర్యం లేకపోవడంతో వాహన యజమాని ఆమెకు పరిహారం చెల్లించాల్సి వచ్చింది.

కేసును విచారించిన మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ మృతురాలి కుటుంబానికి (భర్త, ఆమె మైనర్ కుమారుడు) రూ. 2.5 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అయితే, ఆ మొత్తాన్ని పెంచాలని కోరుతూ బాధిత కుటుంబం ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ను హైకోర్టు 2017లో కొట్టివేసింది. మహిళ గృహిణి కాబట్టి ఆమె ఆదాయం పరిమితమని, కాబట్టి ఆమెకు ఇవ్వాల్సిన పరిహారం ఫిక్స్‌డ్‌గా ఉంటుందని, కనీస ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని పరిహారం చెల్లించడం సబబేనని తేల్చి చెప్పింది.

హైకోర్టు తీర్పును బాధిత కుటుంబం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. తాజాగా ఈ కేసును విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బాధిత కుటుంబానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. గృహిణి సేవలను తక్కువగా అంచనా వేయడం సరికాదని, ఒకదాని తర్వాత ఒకటిగా ఇంటి పనులు చక్కబెట్టే ఆమె సేవలను ఆర్థిక కోణంలో తగదని, ఇంట్లో సంపాదించే వ్యక్తికి ఆమె ఏమీ తక్కువ కాదని పేర్కొంది. ఆమె సేవలను వెలకట్టలేమనడంలో సందేహం లేదని స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పును తప్పుబట్టింది. గృహిణి ఆదాయాన్ని దినసరి కూలీ కంటే తక్కువగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించింది. బాధిత కుటుంబానికి రూ. 6 లక్షల పరిహారాన్ని ఆరు వారాల్లోపు ఇవ్వాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.
Advertisement
HomemakerSupreme CourtLatest NewsCompensation

More Telugu News

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27
..more