Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా జీవనరేఖ, నా సౌభాగ్య రేఖ అంటూ సురేఖకు బర్త్ డే విషెస్ చెప్పిన మెగాస్టార్

Chiru Wishes To His Wife Surekha On Her Birth Day
Advertisement
  • నేడు సురేఖ బర్త్ డే
  • ప్రస్తుతం అమెరికాలో హాలీడేలో చిరు, సురేఖ
  • ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్ష
Advertisement
మెగాస్టార్ చిరంజీవి తన అర్ధాంగి సురేఖకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘నా జీవన రేఖ, నా సౌభాగ్య రేఖ, నా భాగస్వామి సురేఖ.. నా లైఫ్‌లైన్‌కి, నా విజయానికి కారణమైన సురేఖకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి’’ అని ఎక్స్ వేదికగా మెగాస్టార్ ఆకాంక్షించారు. 

చిరంజీవి ప్రస్తుతం సురేఖతో కలిసి విదేశాల్లో ఉన్నారు. విశ్వంభర షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న చిరంజీవి అర్ధాంగితో కలిసి యూఎస్ వెళ్లారు. ఈ విషయాన్ని చిరు స్వయంగా వెల్లడించారు. హాలీడే కోసం యూఎస్ వెళ్తున్నామని,  వచ్చాక తిరిగి విశ్వంభర సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని చెబుతూ సురేఖతో విమానంలో దిగిన సెల్ఫీని షేర్ చేశారు.
Advertisement
Advertisement
Megastar
Chiranjeevi
Konidela Surekha
Surekha Birthday
Tollywood

More Telugu News