మహేశ్ బాబు నివాసానికి వెళ్లి పెళ్లి కార్డు అందించిన దిల్ రాజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ బాబు నివాసానికి వెళ్లి పెళ్లి కార్డు అందించిన దిల్ రాజు

Dil Raju invites Mahesh Babu to Ashish wedding
  • దిల్ రాజు సోదరుడు శిరీష్ ఇంట పెళ్లి బాజాలు
  • స్వయంగా శుభలేఖలు అందిస్తున్న దిల్ రాజు
  • మహేశ్ బాబు, నమ్రత దంపతులకు ఆహ్వానం
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సోదరుడు శిరీష్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. శిరీష్ తనయుడు, యువ హీరో ఆశిష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ నేపథ్యంలో, దిల్ రాజు స్వయంగా ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. 

తాజాగా ఆయన తన సోదరుడు శిరీష్, ఆశిష్, కుమార్తె హన్షితతో కలిసి సూపర్ స్టార్ మహేశ్ బాబు నివాసానికి వెళ్లారు. మహేశ్ బాబు, నమ్రత దంపతులను  కలిసి శుభలేఖ అందించి, పెళ్లికి రావాలని ఆహ్వానించారు. 

కాగా, ఆశిష్ తన కాబోయే అర్ధాంగి అద్వైతతో కలిసి నిన్న మోహన్ బాబు నివాసానికి వెళ్లి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. పెళ్లి సమయానికి తాను 'కన్నప్ప' షూటింగ్ కోసం న్యూజిలాండ్ లో ఉంటానని భావించిన మోహన్ బాబు... కాబోయే జంటను తన నివాసానికి ఆహ్వానించి దీవెనలు అందజేశారు.
Advertisement
Mahesh Babu
Dil Raju
Ashish
Wedding
Advaitha
Shirish
Tollywood

More Telugu News