కాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం జగన్
- 11 గంటలకు మోదీతో భేటీ కానున్న జగన్
- 11.45 గంటలకు నిర్మలా సీతారామన్ తో భేటీ
- రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చించనున్న సీఎం
నిన్న రాత్రి ఢిల్లీకి జగన్ చేరుకున్నారు. నిన్న సాయంత్రం 6 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఆయన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, వైసీపీ లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.