50 వసంతాలు పూర్తి చేసుకున్న గోదావరి ఎక్స్ ప్రెస్... ఘనంగా వేడుకలు

Godavari Express completes 50 years
హైదరాబాద్, విశాఖపట్నం నగరాల మధ్య నడిచే గోదావరి ఎక్స్ ప్రెస్ రైలుకు సుదీర్ఘ చరిత్ర ఉంది. నేటితో ఆ రైలు 50 వసంతాలు పూర్తి చేసుకుంది. 

1974 ఫిబ్రవరి 1న ప్రారంభమైన ఈ రైలు ఇప్పటికీ ప్రజాదరణ పరంగా ముందంజలో ఉంది. ప్రస్తుతం విశాఖ- హైదరాబాద్ మధ్య నడుస్తున్న ఈ రైలును అప్పట్లో వాల్తేరు- హైదరాబాద్ రైలుగా ప్రారంభించారు. మొదట్లో స్టీమ్ ఇంజిన్ తో నడిచిన గోదావరి ఎక్స్ ప్రెస్ కాలక్రమంలో డీజిల్ ఇంజిన్ తోనూ పరుగులు తీసింది. 

కాగా, ఈ రైలు సిల్వర్ జూబ్లీ వేడుకలను నేడు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రైలును అందంగా ముస్తాబు చేశారు. ఈ సాయంత్రం విశాఖలో గోదావరి ఎక్స్ ప్రెస్ బయల్దేరే ముందు ప్రజలు, రైల్వే శాఖ అధికారులు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. హైదరాబాద్ వరకు ఈ ఎక్స్ ప్రెస్ ఆగే ప్రధాన స్టేషన్లలో ఇలాగే వేడుకలు జరపనున్నారు. దీనికి సంబంధించిన ప్రత్యేక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. 
Go Back to Shorts
Godavari Express
50 Years
Silver Jubilee
Visakhapatnam
Hyderabad

More Telugu News