రెరా కార్యదర్శి శివబాలకృష్ణపై సస్పెన్షన్ వేటు వేసిన హెచ్ఎండీఏ కమిషనర్
- ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన శివబాలకృష్ణ
- శివబాలకృష్ణను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ
- ఆయన వద్ద దొరికిన స్థిర, చరాస్తుల విలువ వందల కోట్లు ఉంటుందని అంచనా
ప్రభుత్వ విలువ ప్రకారం... సోదాల్లో దొరికిన మొత్తం ఆస్తుల విలువ రూ.8,26,48,999గా ఉంటుందని భావిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ వందల కోట్ల రూపాయలుగా ఉంటుందని అంటున్నారు. ఇంకా అదనపు ఆస్తులకు సంబంధించిన వెరిఫికేషన్ జరుగుతోందని అధికారులు తెలిపారు. ఏసీబీ యాక్ట్‌లోని యూ/ఎస్ 13(1)(బీ), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.