దారుణం, ఆందోళనకరం.. డీప్ ఫేక్ కంటెంట్‌పై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
- అమెరికన్ పాప్‌సింగర్ టేలర్ స్విఫ్ట్ డీప్ ఫేక్ దృశ్యాలు నెట్టింట వైరల్
- ఏఐ ఆధారిత మైక్రోసాఫ్ట్ ఇమేజ్ జనరేటర్‌తో వీటిని రూపొందించినట్టు వార్తలు
- ఘటనపై స్పందించిన సత్య నాదెళ్ల
- ఇలాంటి సందర్భాల్లో తక్షణ చర్యలు అవసరమని వ్యాఖ్య
టేలర్ స్విఫ్ట్ ఫొటోలు తొలుత ఎక్స్‌లో కనిపించాయి. దీంతో, వెంటనే రంగంలోకి దిగిన కంపెనీ వాటిని తొలగించింది. ‘మా టీం ఈ అసభ్యకర కంటెంట్ మొత్తాన్ని గుర్తించి తొలగిస్తోంది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం. ఇలాంటి కంటెంట్ బయటపడ్డ వెంటనే తొలగించేలా చర్యలు తీసుకుంటున్నాం’’ అని ఎక్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఘటనపై టేలర్ స్విఫ్ట్ కూడా ఆగ్రహంగా ఉన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.