రోహిత్ శర్మ ఇన్‌స్టా పోస్టుపై సురేష్ రైనా కామెంట్.. సోషల్ మీడియాలో వైరల్
- ఆఫ్ఘనిస్థాన్‌పై మూడవ మ్యాచ్ అనంతరం ఇన్‌స్టాలో ఫొటోలు షేర్ చేసిన రోహిత్
- సెంచరీతో చెలరేగడంతో ‘అందుకే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ అంటారు’ అని సురేష్ రైనా కామెంట్
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మాజీ ఆటగాడి కామెంట్
అయితే రోహిత్ శర్మ పోస్టుపై మాజీ ఆటగాడు సురేష్ రైనా ఆసక్తికరంగా స్పందించాడు. ‘ ఈ కారణంగానే ‘ఆల్‌టైమ్ గ్రేటెస్ట్’, వెల్‌డన్’ అని రైనా కామెంట్ చేశాడు. దీంతో ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని దాదాపు 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను సెలక్టర్లు ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌కు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో రోహిత్ ఒక మ్యాచ్‌లో రాణించగా, కోహ్లీ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. దీంతో వీరిద్దరినీ టీ20 ఫార్మాట్‌కు ఎంపిక చేయడం అంత తెవివైన నిర్ణయం కాదనే విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.