షోయబ్ మాలిక్ తో విడాకులపై సానియా మీర్జా తండ్రి ఏమన్నారంటే...!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షోయబ్ మాలిక్ తో విడాకులపై సానియా మీర్జా తండ్రి ఏమన్నారంటే...!

Sania Mirza father Imran Mirza opines on divorce
  • షోయబ్ మాలిక్ రెండో పెళ్లి
  • పాక్ నటి సనా జావెద్ తో షోయబ్ పెళ్లి ఫొటోలు వైరల్
  • ఇటీవలే విడాకులను ప్రస్తావిస్తూ సానియా ఇన్ స్టా పోస్టు
  • తన కుమార్తె 'ఖులా'ను ఎంచుకుందన్న ఇమ్రాన్ మీర్జా
భారత టెన్నిస్ తార సానియా మీర్జా గతంలో పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత చర్చ జరిగిందో, ఇప్పుడు అంతకంటే ఎక్కువ చర్చ జరుగుతోంది. సానియా, షోయబ్ మాలిక్ విడాకులు తీసుకున్నారన్న వార్తలు రావడమే అందుకు కారణం. 

షోయబ్ మాలిక్, పాక్ నటి సనా జావెద్ ను పెళ్లాడినట్టు సోషల్ మీడియాలో ఫొటోలు సందడి చేస్తున్నాయి. ఇటీవల సానియా ఇన్ స్టాగ్రామ్ లో విడాకుల గురించి పోస్టు పెట్టడం, ఇప్పుడు షోయబ్ రెండో పెళ్లి ఫొటోలు తెరపైకి రావడంతో సానియా విడాకులపై ఓ స్పష్టత వచ్చింది. 

దీనిపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా మరింత స్పష్టతనిచ్చారు. తన కుమార్తె సానియా 'ఖులా' (విడాకులు) ను ఎంచుకుందని వెల్లడించారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం... ముస్లిం మహిళలు భర్త సమ్మతితో పని లేకుండా అతడి నుంచి విడిపోవడాన్ని 'ఖులా' అంటారు. ముస్లిం మహిళలకు ఆ మేరకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. ఇప్పుడు సానియా కూడా ఈ మార్గాన్నే ఎంచుకున్నట్టు ఆమె తండ్రి మాటల ద్వారా అర్థమవుతోంది. 

భారత మహిళా టెన్నిస్ కు అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు అందించిన సానియా... 2010 ఏప్రిల్ 12న పాకిస్థాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడింది. వీరికి ఇజాన్ మీర్జా మాలిక్ అనే కుమారుడు ఉన్నాడు. 

అయితే, గతేడాది ఫిబ్రవరి నుంచి సానియా, షోయబ్ మాలిక్ కాపురంపై వార్తలు రావడం మొదలైంది. షోయబ్... నటి సనా జావెద్ తో డేటింగ్ చేస్తుండడంమే అందుకు కారణమని మీడియా కోడైకూసింది. అప్పటినుంచే విడాకుల అంశం అడపాదడపా ప్రచారం జరుగుతున్నప్పటికీ, అటు షోయబ్ కానీ, ఇటు సానియా కానీ ఎక్కడా స్పందించలేదు. 

ఇప్పుడు, షోయబ్... సనాతో తన పెళ్లి ఫొటోలను పంచుకోవడంతో.... సానియా, షోయబ్ విడిపోయింది నిజమేనని నిర్ధారణ అయింది. అటు, సనా జావేద్ కూడా షోయబ్ తో తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అంతేకాదు, ఇన్ స్టాగ్రామ్ లో తన పేరును సనా జావెద్ నుంచి సనా షోయబ్ మాలిక్ గా మార్చుకుంది. 

సనాకు గతంలో ఓసారి పెళ్లయింది. పాక్ టీవీ కార్యక్రమాల్లో నటించే సనా గతంలో ప్రముఖ గాయకుడు ఉమైర్ జస్వాల్ ను పెళ్లాడింది. అయితే మూడేళ్లకే వీరి పెళ్లి పెటాకులైంది.
Advertisement
Sania Mirza
Shoaib Malik
Divorce
Khula
Imran Mirza

More Telugu News