భారీ ధ్వనులతో న్యూసెన్స్... హైదరాబాదులో 6 పబ్ లపై కేసులు

Hyderabad police files case against six pubs
  • భారీ డీజే శబ్దాలతో హోరెత్తిస్తున్న జూబ్లీహిల్స్ లోని పబ్ లు
  • స్థానికుల ఫిర్యాదులతో కేసు నమోదు
  • తనిఖీలు చేసిన పోలీసులు
  • మరోసారి ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పవని పబ్ లకు హెచ్చరిక
హైదరాబాద్ పబ్ లు మరోసారి వార్తల్లోకెక్కాయి. భారీ ధ్వనులతో ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయంటూ హైదరాబాదులోని పలు పబ్ లపై ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో పోలీసులు జూబ్లీహిల్స్ లోని 6 పబ్ లలో తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు. క్లబ్ రోగ్, పోర్ట్ పబ్, హలో కాక్ టెయిల్, ఫ్యాట్ పీజియన్, జీరో 40 పబ్ లతో పాటు మరో పబ్ కూడా నిబంధనలు అతిక్రమిస్తున్నట్టు గుర్తించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా డీజే సౌండ్స్ తో చుట్టుపక్కల వారికి ఇబ్బందులు కలుగజేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. కాగా, కేసులు నమోదైన ఆరు పబ్ లు మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.
Go Back to Shorts
Pub
case
Police
Jubilee Hills
Hyderabad

More Telugu News