ఓడిపోయినా మేం ప్రజలను వదిలేసేది లేదు... ప్రజలే మాకు దేవుళ్లు: హరీశ్ రావు
- మెదక్ జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు
- తెలంగాణ నుంచి కేసీఆర్ను ఎవరూ వేరు చేయలేరని వ్యాఖ్య
- కాంగ్రెస్ అబద్దాలతో తెలంగాణలో గెలిచిందన్న హరీశ్ రావు
తెలంగాణ రావడం వల్లే మనకు నీళ్లు... నిధులు.. నియామకాలు వచ్చాయన్నారు. మన గ్రామాలను మనం అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. తెలంగాణ రావడం వల్లే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలు వచ్చాయన్నారు. వీటన్నింటికి కారణం కేసీఆర్ అని గుర్తుంచుకోవాలన్నారు. అయితే ప్రజాతీర్పును అంగీకరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి వేసిన ప్రతి ఓటు కోసం కృతజ్ఞతతో పని చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు. కేసీఆర్ రైతులకు 24 గంటల విద్యుత్ ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.