ఆ మసీదులను ఖాళీ చేయకుంటే..!: కర్ణాటక బీజేపీ నేత హెచ్చరిక
- ఆలయాలను ధ్వంసం చేసి కట్టిన మసీదులను ఖాళీ చేయాలని మాజీమంత్రి ఈశ్వరప్ప హెచ్చరిక
- లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న బీజేపీ నేత
- ఆలయాలను ధ్వంసం చేసి కట్టిన ఏ ఒక్క మసీదును వదిలిపెట్టబోమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు
ముస్లింలు స్వచ్ఛందంగా ఆ మసీదులను ఖాళీ చేయకుంటే ఏమవుతుందో? ఎంతమంది చనిపోతారో తమకు తెలియదని ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది డిసెంబరులో ఆయన మాట్లాడుతూ.. ఆలయాలను ధ్వంసం చేసి కట్టిన ఏ ఒక్క మసీదును వదిలిపెట్టబోమని హెచ్చరించి వార్తల్లో నిలిచారు. ఇండియా హిందూ దేశంగా మారుతుందని ప్రతిజ్ఞ చేసి మరీ చెబుతున్నట్టు పేర్కొన్నారు.