జగన్ ప్రతిష్ఠ దెబ్బతినేలా విమర్శలు చేస్తున్నారు: ఆళ్ల నాని

  • చంద్రబాబు హయాంలో మొత్తం దోపిడీనే అన్న ఆళ్ల నాని
  • టీడీపీ, జనసేన కుట్రలను ప్రజలు గమనించాలని విన్నపం
  • గత, ప్రస్తుత ప్రభుత్వాల మధ్య తేడా గమనించాలని సూచన
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి ఆళ్ల నాని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు హయాంలో మొత్తం దోపిడీనే అని ఆరోపించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా... ఇచ్చిన ప్రతి హామీని జగన్ నెరవేర్చారని చెప్పారు. కానీ, జగన్ వ్యక్తిగత ప్రతిష్ఠను దిగజార్చేలా టీడీపీ, జనసేన నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏలూరు రూరల్ మండలం చాటపర్రు గ్రామంలో వైఎస్సార్ పెన్షన్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

జగన్ సీఎం అయిన తర్వాత చాటపర్రులో రూ. 58 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. టీడీపీ, జనసేన కుట్రలను ప్రజలు గమనించాలని... అందరూ జగన్ కు అండగా నిలవాలని కోరారు. గత ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించాలని సూచించారు. 


Alla Nani
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
Janasena

More Telugu News