అదానీకి భారీ ఊరట.. హిండెన్ బర్గ్ వివాదంలో సిట్ విచారణకు నో చెప్పిన సుప్రీంకోర్టు
- సెబీ దర్యాఫ్తుపై విశ్వాసం ప్రకటించిన సుప్రీం
- మీడియా రిపోర్టులపై ఆధారపడలేమంటూ కామెంట్
- దర్యాఫ్తును 3 నెలల్లో పూర్తిచేయాలంటూ సెబీకి ఆదేశం
ఈమేరకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన సుప్రీం ధర్మాసనం బుధవారం ఈ తీర్పును వెలువరించింది. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ కంపెనీ గతేడాది అదానీ గ్రూపుపై భారీ ఆరోపణలు చేసింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఓ నివేదిక వెలువరించింది. ఈ నివేదిక తీవ్ర దుమారానికి దారితీసింది. దీనిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) విచారణ చేపట్టింది. అయితే, ఈ వ్యవహారంలో సెబీ దర్యాఫ్తు సరిపోదని, సిట్ విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించి బుధవారం తీర్పు వెలువరించింది.