మాదాపూర్‌‌లో ఓ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం

Fire accident in Madhapur hotel
  • హోటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో షార్ట్ సర్క్యూట్ కావడంతో చెలరేగిన మంటలు
  • మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. హోటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో పోలీసులు, చుట్టుపక్కల స్థానికులు అప్రమత్తమయ్యారు.
Go Back to Shorts
madhapur
Hyderabad
Telangana
Fire Accident
Crime News

More Telugu News