మహిళపై ఎస్పీ, డీసీపీ డ్రైవర్ల లైంగికదాడి.. రెండు గంటల్లోనే నిందితుల అరెస్ట్
- ఝార్ఖండ్‌లోని పాలము జిల్లాలో ఘటన
- మహిళను బెదిరించి అఘాయిత్యం
- చెబితే చంపేస్తామని బెదిరింపు
మొబైల్ రీచార్జ్ కోసం బాధితురాలు దల్తోంగంజ్ రైల్వే ష్టేషన్కు వెళ్తుండగా నిందితులు ఇద్దరు ఆమెతో మాటలు కలిపారు. ఆ తర్వాత ఆమెను బలవంతంగా రెసిడెంట్స్ క్వార్టర్స్‌కు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత బాధిత మహిళ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితులను పోలీసులు రెండు గంటల్లోనే అరెస్ట్ చేశారు. లైంగికదాడి ఘటనను పాలము ఎస్పీ రీష్మా రమేశన్ నిర్ధారించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.