Praja Bhavan Accident Case: దుబాయ్ పారిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు.. సాహిల్‌ను తప్పించే ప్రయత్నం చేసిన పంజాగుట్ట ఎస్‌హెచ్‌వోపై సీపీ వేటు

Ex MLA Shakil Ahmad Son Rahil Amir In Dubai Police Issue Look Out Notice
షార్ట్స్‌లో చూడండి
మితిమీరిన వేగంతో కారు నడిపి ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టిన కేసులో ప్రధాన నిందితుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ అలియాస్ రాహిల్ అమీర్ దుబాయ్‌కి పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నుంచి తప్పించుకునేందుకు తొలుత ముంబైకి, ఆ తర్వాత అక్కడి నుంచి దుబాయ్ కి పరారైనట్టు పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. నిన్న లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు.

మరోవైపు, సాహిల్‌ను కేసు నుంచి తప్పించేందుకు రూ. 20 నుంచి రూ. 25 లక్షలు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి ప్రమాదం జరగ్గా, ఆదివారం తెల్లవారుజామున నలుగురు వ్యక్తులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులతో మంతనాలు జరిపినట్టు అక్కడి సీసీటీవీల్లో రికార్డయింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. కాగా, కేసు నుంచి నిందితుడు సాహిల్‌ను తప్పించేందుకు ప్రయత్నం చేసిన పంజాగుట్ట స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సస్పెండ్ చేశారు.
Go Back to Shorts
Praja Bhavan Accident Case
Rahil Amir
Sahil
Shakil Ahmed

More Telugu News