పెరుగుతున్న కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు
- బుధవారం కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ వెల్లడి
- రాష్ట్రంలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 14గా ఉన్నట్లు వెల్లడి
- కొత్త కేసులన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నట్లు తెలిపిన వైద్య శాఖ
రాష్ట్రంలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 14కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో 6 కొత్త కేసులు నమోదు కాగా, ఒకరు రికవరీ అయ్యారు. రికవరీ రేటు 99.51 శాతంగా ఉన్నదని వైద్య శాఖ వెల్లడించింది.