అబద్ధాలను నిజాలు చేయడంలో హరీశ్ రావుకు కేసీఆర్ పోలికలు వచ్చాయి: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- కేసీఆర్, కేటీఆర్ నిన్ను బాగా వాడుకుంటారని హరీశ్ రావుకు రాజగోపాలరెడ్డి కౌంటర్
- కేసీఆర్ తర్వాత కేటీఆరే అవుతారని వ్యాఖ్య
- అసెంబ్లీలో హరీశ్ రావు తన పేరును వ్యక్తిగతంగా తీసుకున్నట్లు చెప్పిన రాజగోపాల్ రెడ్డి
'నువ్వు లేచి మమ్మల్ని అడ్డుకున్నంత మాత్రాన నీకు మంత్రి పదవి రాదుపో' అని హరీశ్ రావు తనను ఉద్దేశించి అన్నారని.. అందుకే తాను ఒకటే చెబుతున్నానని.. హరీశ్ రావు ఎన్ని సంవత్సరాలు కష్టపడినా కేసీఆర్ తర్వాత కేటీఆరే అవుతారు కానీ మీకు మోసం జరుగుతుంది... మీకు వారు ఏం చేయరు... మీకు అన్యాయమే జరుగుతుందన్నారు. తండ్రీ కొడుకులు మిమ్మల్ని వాడుకుంటారు తప్ప మీకు అక్కడ న్యాయం జరగదన్నారు. నాకు మంత్రి పదవి రావాలా? వద్దా? మా ముఖ్యమంత్రి, అధిష్ఠానం నిర్ణయం తీసుకుంతాయని.. కానీ తండ్రీకొడుకులు నిన్ను... వాడుకున్నోనికి వాడుకున్నంత అన్నట్లు.. నిన్ను చాలా వాడుకుంటారని హరీశ్ రావును ఉద్దేశించి అన్నారు.