అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి, హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం
- హరీశ్ ఎంత బాగా పని చేసినా కేసీఆర్ సీఎం పదవి ఇవ్వరన్న రాజగోపాల్ రెడ్డి
- రూ. 50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవి కొనుక్కోవాల్సిన ఖర్మ మాకు లేదన్న హరీశ్
- హరీశ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్
హరీశ్ వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. తన వ్యాఖ్యలను హరీశ్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజగోపాల్ రెడ్డి ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే... తన వ్యాఖ్యలను తాను వెనక్కి తీసుకుంటానని హరీశ్ చెప్పారు. మరోవైపు, హరీశ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా సూచించారు. అయినా హరీశ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోవడంతో ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.