జనసేన పార్టీ తన పేరును ఆ విధంగా మార్చుకుంటే ఎవరికీ ఏ సమస్య ఉండదు: రాంగోపాల్ వర్మ
- ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన
- నేడు యువగళం విజయోత్సవ సభ
- హాజరవుతున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్
- జనసేన పార్టీ పేరును చంద్రసేన పార్టీగా మార్చుకోవాలన్న వర్మ
ఏపీలో జనసేన, టీడీపీతో పొత్తు పెట్టుకుంది. పొత్తు కారణంగా, ఇవాళ యువగళం విజయోత్సవ సభకు కూడా పవన్ హాజరవుతున్నారు. ఈ సభకు చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణ తదితర టీడీపీ అగ్రనేతలందరూ హాజరవుతున్నారు.
చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణలతో కలిసి ఒకే వేదిక పంచుకోనుండడం పవన్ కు ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో వర్మ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.