తెలంగాణ ముఖ్యమంత్రి 'ఎన్నారై' వ్యాఖ్యలపై మహేశ్ బిగాల తీవ్ర ఆగ్రహం
- ఎన్నారైలు అంటే నాన్ రిలయబుల్ ఇండియన్ అన్న ముఖ్యమంత్రి
- ఇది ఎన్నారైలను అవమానించడమేనన్న మహేశ్ బిగాల
- సీఎం వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తొలగించాలని విజ్ఞప్తి
ఎన్నారై అంటే 'నాన్ రెసిడెంట్ ఇండియన్స్' అని సీఎం సరిదిద్దుకోవాలని హితవు పలికారు. గౌరవసభలో అందరి మర్యాదలు కాపాడేటట్టు ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు భారత ఆర్థిక వ్యవస్థకు చేదోడు వాదోడుగా ఉంటున్నారని గుర్తుంచుకోవాలన్నారు. విదేశీ డబ్బును తమ తమ కుటుంబాలకు పంపడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారన్నారు. సీఎం వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తొలగించాలని ఎన్నారైల తరఫున కోరుతున్నట్లు చెప్పారు.