ఉమ్మడి పాలనలో అన్యాయం జరుగుతోందనే తెలంగాణ తెచ్చుకున్నాం: పొన్నం ప్రభాకర్
- గత యాభై ఏళ్ల చరిత్ర గురించి ఇప్పుడు అవసరంలేదన్న మంత్రి
- తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో మాట్లాడుకుందామని హితవు
- కేటీఆర్ విమర్శలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
తెలంగాణలో గత ప్రభుత్వ కార్యకలాపాలపై మాట్లాడేందుకు ఏమీ కనిపించడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. పైన పటారం లోన లొటారం తరహాలో గత ప్రభుత్వం పాలించిందని, ఊపర్ షేర్వాణీ అందర్ పరేషానీ తీరులో పాలన జరిపిందని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా వాస్తవాలను మాట్లాడాలని అంతేకానీ మా తాతలు మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టారని చెబితే కుదరంటూ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.