హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ప్రకటించిన గంటలోనే ముంబై ఇండియన్స్‌కి ఊహించని షాక్
- ప్రకటన వెలువడిన గంటలోనే టీమ్ ‘ఎక్స్’ పేజీని అన్‌ఫాలో చేసిన 4 లక్షల మంది ఫ్యాన్స్
- 5 సార్లు టైటిల్స్ అందించిన రోహిత్ స్థానంలో పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించడంపై కొందరు ఫ్యాన్స్ అసంతృప్తి
- జట్టు కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యాను శుక్రవారం సాయంత్రం ప్రకటించిన ముంబై ఇండియన్స్
కాగా రోహిత్ శర్మ 2013 నుంచి ఈ ఏడాది సీజన్ 2023 వరకు ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు. రికార్డు స్థాయిలో 5 సార్లు టైటిళ్లు గెలిపించారు. కాగా రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యాను శుక్రవారం సాయంత్రం ముంబై ఇండియన్స్ ప్రకటించింది. భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేందుకు కట్టుబడి ఉన్నామని వివరణ ఇచ్చింది. సచిన్ టెండూల్కర్ నుంచి హర్భజన్ వరకు, రికీ పాంటింగ్ నుంచి రోహిత్ వరకు అసాధారణమైన నాయకత్వాన్ని అందించారని కొనియాడింది. కాగా ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు. తిరిగి వచ్చే సీజన్‌లో ముంబైకి ఆడబోతున్నాడు.