మంత్రి సీతక్క స్వగ్రామం జగ్గన్నపేటకి బస్సు
- పత్తిపల్లి-పొట్లాపూర్ మార్గంలో సర్వే చేసిన ఆర్టీసీ అధికారులు
- త్వరలోనే బస్సు నడిపిస్తామన్న వరంగల్-2 డిపో మేనేజర్ సురేశ్
- జగ్గన్నపేట గ్రామానికి బస్సు లేదంటూ మీడియాలో వచ్చిన కథనాలపై అధికారుల స్పందన
కాగా మంత్రి సీతక్క సొంత గ్రామం జగ్గన్నపేట ములుగు జిల్లాలో ఉంది. ఈ గ్రామానికి రోడ్డు మార్గం ఉన్నప్పటికీ ఆర్టీసీ ప్రస్తుతం బస్సులు నడపటం లేదు. ‘మహాలక్ష్మి’ పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న నేపథ్యంలో జగ్గన్నపేట గ్రామానికి బస్సులు నడపకపోవడంపై స్థానికంగా చర్చ జరిగింది. ఈ మేరకు మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఈ విషయం ఆర్టీసీ అధికారుల దృష్టికి వెళ్లడంతో స్పందించారు. దీంతో ఎట్టకేలకు తమ గ్రామానికి బస్సు సౌకర్యం రాబోతోందని జగ్గన్నపేట గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.