యూపీలో విషాదం.. టైరు పేలడంతో ట్రక్కును ఢీకొట్టిన కారు.. చిన్నారి సహా 8 మంది సజీవ దహనం

UP road tragedy 8 including child dead
ఉత్తరప్రదేశ్‌లోని భోజిపురాలో తీరని విషాదం నెలకొంది. కారు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో చిన్నారి సహా 8మంది సజీవ దహనమయ్యారు. బాధితులు ఓ వివాహానికి హాజరై వస్తుండగా శనివారం రాత్రి బరేలీ జాతీయ రహదారిపై జరిగిందీ ఘటన. ప్రమాదం తర్వాత కారు సెంట్రల్ లాక్ పడిపోవడంతో లోపలున్న వారు తప్పించుకునే మార్గం లేకుండా పోయింది. 

కారు టైరు పేలిపోవడంతో అదుపుతప్పి అవతిలి రోడ్డులో ఉత్తరాఖండ్ నుంచి ఇసుకతో వస్తున్న ట్రక్కును ఢీకొట్టి నుజ్జునుజ్జు అయింది. కారును ట్రక్కు కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. కారు డోర్లు లాక్ కావడంతో లోపల ఉన్నవారు తప్పించుకోలేకపోయారు. మంటల్లో అందరూ సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు నుంచి చిన్నారి సహా ఏడుగురి మృతదేహాలను బయటకు తీశారు. బాధితులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Tragegy
Uttar Pradesh
UP Road Accident

More Telugu News