BRSLP: బీఆర్ఎస్ శాసన సభాపక్ష నేతగా కేసీఆర్

KCR Is Elected As BRSLP Leader
షార్ట్స్‌లో చూడండి
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) శాసన సభాపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈమేరకు శనివారం ఉదయం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ జరిగింది. సీనియర్ లీడర్ కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు 37 మంది హాజరయ్యారు. శస్త్ర చికిత్స కారణంగా మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గైర్హాజరయ్యారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కూడా ఈ భేటీకి హాజరుకాలేదు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలుపొందిన బీఆర్ఎస్ శాసన సభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించనుంది. ఈ నేపథ్యంలో పార్టీ శాసన సభాపక్ష నేతను ఎన్నుకోవడానికి శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ మీటింగ్ లో తమ లీడర్ గా కేసీఆర్ ను ఎన్నుకుంటూ ఏకవాక్య తీర్మానం చేసి ఆమోదించారు. అనంతరం ఒకే బస్సులో ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.
Go Back to Shorts
BRSLP
KCR
Telangana
Assembly session

More Telugu News