లిఫ్ట్ ప్రమాదం.. డెలివరీ బాయ్ దుర్మరణం!

Hyderabad Delivery boy accidentally falls on lift dies
  • డోర్ తెరిచుండటంతో లిఫ్ట్ వచ్చిందని పొరపాటు పడి లోపల కాలుపెట్టిన డెలివరీ బాయ్
  • నాలుగో అంతస్తు నుంచి మొదటి అంతస్తులోని లిఫ్ట్ పైభాగంలో పడ్డ వైనం
  • లిఫ్ట్ పైకి వెళ్లడంతో స్లాబ్ కింద పడి దుర్మరణం
గ్రిల్స్ తెరిచి ఉండటంతో లిఫ్ట్ వచ్చిందనుకుని లోపల కాలు పెట్టిన ఓ డెలివరీ బాయ్ నాలుగో అంతస్తు నుంచి లిఫ్ట్‌పై పడ్డాడు. ఆ తరువాత లిఫ్ట్‌పైకి రావడంతో అతడు స్లాబ్ కింద నలిగిపోయి దుర్మరణం చెందాడు. రంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జేమ్స్(38) అనే వ్యక్తి తన భార్యా పిల్లలతో కలిసి మయూరీ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతడు డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు. గురువారం అతడు ఓ పార్సిల్ డెలివరీని వెనక్కు తీసుకునేందుకు అశోక్‌నగర్‌లోని నివాస్ టవర్స్‌కు వెళ్లాడు. నాలుగో అంతస్తులోని ఓ ఫ్లాట్‌ నుంచి పార్సిల్ తీసుకుని తిరిగొస్తుండగా లిఫ్ట్ గ్రిల్స్ తెరిచి ఉంది. ఆ సమయంలో ఫోన్లో మాట్లాడుతున్న అతడు లిఫ్ట్ పైకిరాని విషయాన్ని గమనించక లోపలికి కాలుపెట్టడంతో మొదటి అంతస్తులో ఉన్న లిఫ్ట్ పైభాగంపై పడ్డాడు. 

ఆ తరువాత లిఫ్ట్ పైకి వెళ్లడంతో అతడు స్లాబ్‌కింద పడి నలిగి దుర్మరణం చెందాడు. అయితే, లిఫ్ట్ మూడో అంతస్తులో ఆగిపోవడంతో మరమ్మతులు చేసేందుకు వచ్చిన మెకానిక్.. జేమ్స్ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
Go Back to Shorts
Ranga Reddy District
Hyderabad

More Telugu News