రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకునే యత్నం

Revanth Reddy followers dharna at Hotel
గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా వద్ద పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు... రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారు హోటల్లోకి దూసుకువెళ్లే ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు... కార్యకర్తలను నిలువరించి బయటకు పంపించారు. ఈ సమయంలో ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతనిని అడ్డుకున్నారు. దాదాపు రెండు రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పదవి కోసం రేవంత్ రెడ్డి, మల్లు బట్టి విక్రమార్క వంటి నేతలు పోటీ పడ్డారు. అయితే రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. సాయంత్రం డీకే శివకుమార్ సీఎం అభ్యర్థిపై ప్రకటన చేయనున్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
Telangana Assembly Results

More Telugu News