97% మార్కులు.. డాక్టర్ కావాలనే కల.. యువతి విషాద నిర్ణయం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

97% మార్కులు.. డాక్టర్ కావాలనే కల.. యువతి విషాద నిర్ణయం!

97 percent marks dream of becoming a doctor young woman tragic decision
  • డెహ్రాడూన్‌లో 23 ఏళ్ల యువతి ఆత్మహత్య
  • మృతురాలు రియా కుమారి థాపాగా గుర్తింపు
  • ఇంటర్‌లో 97 శాతం మార్కులతో పాఠశాల టాపర్
  • నీట్ రీ-ఎగ్జామ్‌కు సిద్ధమవుతున్న యువతి
  • గదిలో లభించిన సూసైడ్ నోట్
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటర్‌లో 97 శాతం మార్కులు సాధించి వైద్య విద్యలో ప్రవేశం కోసం సిద్ధమవుతున్న 23 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు రియా కుమారి థాపాగా గుర్తించారు. ఆమె తండ్రి 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికుడు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. రియా రాత్రి వేళల్లో చదువుకునే అలవాటు ఉండటంతో సాధారణంగా ఆలస్యంగా నిద్రలేచేది. అయితే బుధవారం మధ్యాహ్నం అయినా గది తలుపు తీయకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది.

భోజనానికి పిలవడానికి వెళ్లిన తల్లి పలుసార్లు పిలిచినా స్పందన రాలేదు. దీంతో తండ్రికి సమాచారం ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులు గది తలుపు బలవంతంగా తెరిచి చూడగా రియా ఉరివేసుకుని కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో ఓ లేఖ లభించినట్లు తెలుస్తోంది. అందులో ‘ఐ లవ్ యూ మమ్మీ, పాపా. నా మరణానికి ఎవరూ బాధ్యులు కారు’ అని రాసినట్లు పోలీసులు వెల్లడించారు. తన నిర్ణయానికి తానే కారణమని, ఇతరులను నిందించవద్దని ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

పోలీసుల ప్రాథమిక విచారణలో చదువుకు సంబంధించిన ఒత్తిడి, ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల ఆమె తీవ్ర నిరాశకు గురైనట్లు వెల్లడైంది. ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షలో ఆమెకు అనుకున్న ఫలితం రాలేదని జూన్ 21న జరగనున్న రీ-ఎగ్జామ్‌కు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్‌లో 97 శాతం మార్కులు సాధించి పాఠశాల టాపర్‌గా నిలిచిన రియా వైద్య విద్యలో చేరాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Advertisement
Riya Kumari Thapa
Dehradun student suicide
NEET exam pressure
Uttarakhand news
Kargil veteran daughter
Medical aspirant suicide

More Telugu News