పోలీసు ఆఫీసర్ తనయుడి ర్యాష్ డ్రైవింగ్.. మహిళ దుర్మరణం
- హన్మకొండలోని కాజీపేట కేంద్రంలో ఘటన
- బైక్ ఎక్కుతున్న మహిళను వెనక నుంచి ఢీకొట్టిన కారు
- ఘటనా స్థలంలోనే మహిళ మృతి
ఓటు వేయడానికి భర్తతో వచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కారు రాంగ్ రూట్లో మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో యాక్సిడెంట్ జరిగింది. కారు నడిపిన యువకుడు ఎక్సైజ్ శాఖ సీఐ కుమారుడని సమాచారం.