దిల్ రాజు కుటుంబంలో మోగనున్న పెళ్లి బాజాలు

Wedding bells in Dil Raju family
  • దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడి నిశ్చితార్థం
  • ఏపీకి చెందిన అద్వితతో ఆశిష్ రెడ్డి ఎంగేజ్ మెంట్
  • ఫిబ్రవరిలో పెళ్లి!
ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుటుంబంలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నాడు. ఏపీకి చెందిన అద్విత రెడ్డితో ఆశిష్ రెడ్డి నిశ్చితార్థం నేడు ఘనంగా జరిగింది. వీరి వివాహం ఫిబ్రవరిలో జరగనున్నట్టు తెలుస్తోంది. 

అద్విత తండ్రి ఓ వ్యాపారవేత్త! కాగా, నిశ్చితార్థ వేడుకకు ఇరు కుటుంబాల వారు, బంధువులు, సన్నిహితులు పరిమిత సంఖ్యలో హాజరయ్యారు. ఆశిష్ రెడ్డి 'రౌడీ బాయ్స్' చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ప్రస్తుతం 'సెల్ఫిష్' అనే చిత్రంతో పాటు మరో చిత్రంలోనూ ఆశిష్ నటిస్తున్నాడు. 'సెల్ఫిష్' త్వరలోనే రిలీజ్ కానుంది.
Advertisement
Dil Raju
Sirish
Asish
Engagement
Advitha
Tollywood

More Telugu News