రేణిగుంట చేరుకున్న చంద్రబాబు... ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు

Chandrababu arrives Vijayawada airport
  • తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన చంద్రబాబు
  • రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద భారీ కోలాహలం
  • ఈ రాత్రికి తిరుమలలో బస చేయనున్న టీడీపీ అధినేత 
  • రేపు ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం ఈ సాయంత్రం రేణిగుంట చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి చంద్రబాబు ప్రత్యేక విమానంలో వచ్చారు. రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. టీడీపీ అధినేత రాకతో విమానాశ్రయం వద్ద భారీ కోలాహలం నెలకొంది. 

టీడీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. చంద్రబాబు పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. చంద్రబాబు రోడ్డు మార్గం ద్వారా తిరుమల చేరుకోనున్నారు. ఈ రాత్రికి తిరుమలలో బస చేసి, రేపు ఉదయం వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకుని విజయవాడ పయనం కానున్నారు.
Go Back to Shorts
Chandrababu
Renigunta
Tirumala
Tirupati
TDP
Andhra Pradesh

More Telugu News