** Photos: బాయ్ ఫ్రెండ్ ఫోన్ లో 13 వేల నగ్న ఫొటోలు.. గర్ల్ ఫ్రెండ్ షాక్!
- బెంగళూరులో సహోద్యోగితో లివిన్ లో ఉంటున్న యువతి
- సన్నిహితంగా గడిపిన క్షణాలను ఫొటో తీసిన యువకుడు
- వాటిని తొలగించేందుకు ఫోన్ గ్యాలరీ చూడగా కుప్పలకొద్దీ నగ్న ఫొటోలు
- పోలీసులను ఆశ్రయించిన యువతి
ఆఫీసులో తనతో పాటు పనిచేస్తున్న యువకుడిపై ఇష్టంతో సహజీవనం చేస్తున్న యువతికి షాక్ తగిలింది.. తన పార్ట్ నర్ ఫోన్ లో తనతో పాటు తన సీనియర్లు, ఇతర మహిళా ఉద్యోగులకు సంబంధించి మొత్తం 13 వేలకు పైగా నగ్న ఫొటోలు కనిపించడమే దీనికి కారణం. దీంతో వెంటనే తన సీనియర్లకు విషయం తెలియజేసింది. వారి సూచనలతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఆ యువకుడు వాటి ఆధారంగా ఇప్పటి వరకు ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయడం వంటి ఘటనలకు పాల్పడలేదని సమాచారం.
బెంగళూరుకు చెందిన తన్వీ (పేరు మార్చాం) ఓ బీపీవో కంపెనీలో పనిచేస్తోంది. తనతో పాటు పనిచేస్తున్న ఆదిత్య సంతోష్ అనే యువకుడితో సహజీవనం చేస్తోంది. ఇద్దరూ కలిసి సన్నిహితంగా ఉన్నప్పుడు సంతోష్ ఫొటోలు తీశాడు. వాటిని ఫోన్ లో నుంచి తొలగించాలని తన్వీ ప్రయత్నించింది. ఆదిత్య నిద్రిస్తుండగా అతడి ఫోన్ ఓపెన్ చేసిన తన్వి షాక్ కు గురైంది. అందులో పదులు, వందలు కాదు.. ఏకంగా 13 వేల న్యూడ్ ఫొటోలు ఉండడమే కారణం. అందులో కొన్ని ఫొటోలు తనవి కాగా మరికొన్ని తమ కంపెనీలో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగులవిగా గుర్తించింది. కొన్ని నిజమైన ఫొటోలు, మరికొన్ని మార్ఫింగ్ చేసిన ఫొటోలని తర్వాత పోలీసులు చెప్పారు.
ఈ విషయాన్ని సంస్థ మేనేజ్ మెంట్ దృష్టికి తీసుకెళ్లగా.. ఉద్యోగుల సేఫ్టీ దృష్ట్యా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో తన్వి, ఇతర ఉద్యోగులు బెంగళూరు సైబర్ పోలీసులను ఆశ్రయించారు. ఆదిత్య ఇప్పటి వరకూ వీటితో ఎవరినీ బెదిరించకపోయినా.. మహిళల నగ్న ఫొటోలతో భవిష్యత్తులో బెదిరింపులకు పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన్వి ఫిర్యాదుతో ఆదిత్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు బెంగళూరు సైబర్ పోలీసులు తెలిపారు.