డిసెంబరు 1న శ్రీవారి దర్శనం చేసుకోనున్న చంద్రబాబు
- ఇటీవల బెయిల్ పై విడుదలైన చంద్రబాబు
- కంటికి శస్త్రచికిత్స... హైదరాబాదు నివాసంలో విశ్రాంతి
- పుణ్యక్షేత్రాలు సందర్శించాలని నిర్ణయం
- ఈ నెల 30న కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల పయనం
చంద్రబాబు డిసెంబరు 2న విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం, సింహాచలం క్షేత్రం, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆపై చంద్రబాబు పూర్తిస్థాయిలో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొననున్నారు.