రష్మిక మందన్న తర్వాత అలియా భట్ డీప్ ఫేక్ వీడియో వైరల్

  • దేశంలో కలకలం రేపుతున్న డీప్ ఫేక్ వీడియోలు
  • ఇప్పటికే దీని బారిన పడ్డ రష్మిక, కాజోల్
  • తాజాగా వైరల్ అవుతున్న అలియా భట్ బోల్డ్ వీడియో
డీప్ ఫేక్ వీడియోలు మన దేశంలో కలకలం రేపుతున్నాయి. హీరోయిన్ల ఫేక్ వీడియోలు ఒకటి తర్వాత మరొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే రష్మిక, కాజోల్ దీని బారిన పడ్డారు. తాజాగా అలియా భట్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అలియాను బోల్డ్ గా చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ వీడియో ఒరిజినల్ ఎవరిదనే విషయం ఇంకా తెలియలేదు. డీప్ ఫేక్ వీడియోలపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉంది. సెలబ్రిటీలకే ఇలాంటి వేధింపులు ఎదురవుతుంటే... ఇక తమ పరిస్థితి ఏమిటని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ వీడియోలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

Alia Bhatt
Bollywood
Deepfake Video
Rashmika Mandanna
Kajol

More Telugu News